ఉంగుటూరు: మండలంలోని గోపీనాథపట్నం గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు బీరా పెద్దిరాజు ఆ పార్టీని వీడి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. పెద్దిరాజుతో పాటు గ్రామానికి చెందిన సుమారు 30 మంది కార్యకర్తలకు వాసుబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చెరుకూరి రాజు, మాజీ ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్ పుచ్చకాయల విష్ణుమూర్తి, మండల అధ్యక్షుడు మరడ మంగారావు, జెడ్పీటీసీ అభ్యర్థి ఎలిశెట్టి పాపారావు (బాబ్జీ), ఎంపీటీసీ అభ్యర్థి పేరూరి దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు.


