నూజివీడు: మండల మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు కృష్ణా జిల్లా బొమ్ములూరులోని దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం రూ. 5 లక్షల విలువైన శాంతి రథాన్ని అందించారు. సంస్థ ఆవరణలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆయన ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూఅంత్యక్రియల సమయంలో వాహనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయ తెలుసుకుని, మానవత సంస్థ రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు కోరిక మేరకు ఈ సాయం అందించినట్లు తెలిపారు. కోటేశ్వరరావు దాత సుబ్రహ్మణ్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్, నెక్స్‌జెన్ డైరెక్టర్ కొండ్రెడ్డి సత్యనారాయణ, ఏలూరు రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు అడుసుమిల్లి నిర్మల, కై కలూరు మానవత డైరెక్టర్ కొండ్రెడ్డి చిట్టెమ్మ, హేలాపురి బాలోత్సవ్ ప్రతినిధులు కూచిపూడి సత్యనారాయణ, గుడిపాటి వెంకట లక్ష్మీనరసింహారావు, దేవరకొండ వెంకటేశ్వరరావు, నూజివీడు మానవత చైర్మన్ పురాణం కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


