కై కలూరు: అర్నబ్ పెను తుపాను నేపథ్యంలో అనవసరంగా ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావద్దని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ హెచ్చరించారు. తుపాను అత్యవరసర చర్యల పర్యవేక్షణలో భాగంగా కై కలూరు హైస్కూల్‌లో పునరావాస కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. నిర్వాసితులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం సర్కిల్ కా ర్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ ఈదురుగాలులకు పలు మండలాల్లో చెట్లు రహదారులపై నెలకొరిగాయన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక ఏపీఎస్‌ఆర్, పోలీసు సి బ్బంది యుద్ధప్రాతిపాదికన చెట్లును తొలగించారన్నారు. ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావరం గణపవరం, కై కలూరు ప్రాంతాల్లో కనిపించిందన్నారు. గాలులకు తెగిపడిన విద్యుత్ తీగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తడిచిన చెట్లు వద్ద వాహనాలను నిలిపి ప్రజలు ఉండకూడదన్నారు. జిల్లాస్థాయిలో నిర్వాసితుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రభుతాధికారులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. అత్యవసరమైతే పోలీసుశాఖ 112కు సమాచారం అందించాలన్నారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్, రూరల్ సర్కిల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, ఏవీఎస్ రామకృష్ణ, కై కలూరు టౌన్ ఎస్సై కె.గణేష్‌వర్మ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో అర్నాబ్ తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరూ గమనించి, సంబంధిత వి ద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. బుధవారం ఉపాధ్యాయులు తమ పాఠశాలలను పరిశీలించి, విద్యుత్ సరఫ రా సమస్య, భారీ వర్షాలకు పాఠశాల భవనాల స్థితిని పరిశీలించి నివేదికలు అందించాలని కలెక్టర్ డీఈఓని ఆదేశించారు.
చింతలపూడి: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చింతలపూడి నగర పంచాయతీలో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి 23 వార్డులకు 23 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆమోదంతో ఈనెల 26న చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయంతో పాటు అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లో ముసాయిదా నోటిఫికేషన్ ప్రచురించినట్టు నగర పంచాయతీ కమిషనర్ ఎ.రాంబాబు తెలిపారు. సదరు నోటిఫికేషన్‌పై ఎటువంటి అభ్యంతరాలు, సలహాలు రానందున బుధవారం సాయంత్రం ఇదే తుది జాబితాగా కమిషనర్ ప్రకటించారు.
ఏలూరు టౌన్: సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఇన్‌చార్జి డీఆర్వో ఎం.ముక్కంటి అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగవంగా కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064పై ప్రచురించిన వాల్‌పోస్టర్లను డీఆర్వో, అడిషినల్ ఎస్పీ వై.ప్రసాదరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈ టోల్‌ఫ్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం కల్పించి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. అదనపు ఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ సమాజంలో అవినీతిరహిత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రజల్లో చైతన్యం అవసరమని పేర్కొన్నా రు. అవినీతిపై టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చే యాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. అ వినీతి నిరోధక శాఖ డీఎస్పి జీవీ కృష్ణారావు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, అలాగే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని సూచించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


