ముమ్మరంగా సహాయక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా సహాయక చర్యలు

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

ముమ్మరంగా సహాయక చర్యలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో తుపాను సహాయక చర్యలు ముమ్మరంగా చే యాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో తుపాను పరిస్థితిపై కంట్రోల్‌రూమ్‌ నుంచి పర్యవేక్షించారు. జిల్లాలోని 28 మండలాల్లోని 185 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని, ప్రాథమిక అంచనాల ప్రకారం 16,796 హెక్టార్లలోని పంటలు నీటమునిగాయన్నారు. తుపాను ప్రభావం మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చి, భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీరు ఉండేలా చూడాలని, విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు ఏర్పాటుచేయాలన్నారు.

50 పునరావాస కేంద్రాలు : జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని 1,900 మంది ప్రజలను 50 పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకూ 852 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మూడు పాడిపశువుల మరణించాయని, 418 చెట్లు కూలిపోయాయని, 120 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్టు చెప్పా రు. 18 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రా వణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఎం.ముక్కంటి, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, ఆర్డీఓలు, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వెట్రిసెల్వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement