ముగిసిన రాష్ట్రస్థాయి మల్లఖంబ్‌ క్రీడాపోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి మల్లఖంబ్‌ క్రీడాపోటీలు

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

ముగిసిన రాష్ట్రస్థాయి మల్లఖంబ్‌ క్రీడాపోటీలు

వీరవాసరం: స్థానిక ఎంఆర్‌కే జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–14, 17, 19 బాలబాలికల మల్లఖంబ్‌ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయని టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బాజింకి వెంకట శ్రీనివాసరావు తెలిపారు. పోటీల ముగింపు కార్యక్రమంలో ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్‌ ఎస్‌వీకేఎస్‌వీ ప్రసాద్‌, పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎండీ కుద్దూస్‌, అడ్మిన్‌ సెక్రటరీ జి.నర్మద, పశ్చిమగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.రామకృష్ణ, కార్యదర్శి పీఎస్‌ఎన్‌ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.

ఓవరాల్‌ చాంపియన్‌గా పశ్చిమ జట్టు

పశ్చిమ గోదావరి జిల్లా జట్టు బాలురు, బాలికల విభాగాల్లోనూ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో మొదటి స్థానం పశ్చిమ గోదావరి జిల్లా సాధించగా, 2వ స్థానం విశాఖపట్నం జిల్లా, 3వ స్థానం కృష్ణా జిల్లా సాధించాయి. బాలికల విభాగంలో మొదటి స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా నిలవగా 2వ స్థానంలో విశాఖపట్నం జిల్లా, 3వ స్థానం కృష్ణా జిల్లా కై వసం చేసుకున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు అండర్‌–14, 17, 19 విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగే 70వ జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ మల్లఖంబ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement