శ్రీ ఆంజనేయం | - | Sakshi
Sakshi News home page

శ్రీ ఆంజనేయం

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

శ్రీ ఆంజనేయం బుట్టాయగూడెంలో ఫ్లాగ్‌ మార్చ్‌

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెంలో స్వయంభూ శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు నిర్వహించారు. వివిధ సేవల రూపంలో స్వామివారికి రూ.2,26,019 ఆదాయం సమకూరిందని, 2,587 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం ద్వారా అన్నప్రసాద వితరణ చేసినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.

బుట్టాయగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం బుట్టాయగూడెం మండలంలోని ప్రధాన ప్రాంతాల్లో సీఐ బి.యాదగిరి, ఎస్సైలు చెన్నారావు, వి.క్రాంతి కుమార్‌ల ఆధ్వర్యంలో పోలీసు బలగాలు, జిల్లా స్పెషల్‌ పార్టీ బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అశాంతికి తావులేకుండా ఈ కవాతు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ, ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్ల గుండా సాగిన ఈ కవాతు ప్రజలకు పూర్తి భద్రతా భావాన్ని కల్పించింది. ఎన్నికల ప్రశాంతతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement