కంచికచర్ల: ముందు వెళ్తున్న లారీని నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ తీవ్రంగా గాయపడింది. కై కలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు డ్రైవర్ నిద్ర మత్తులో కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు రోడ్డుపై పల్టీకొట్టింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా వారిలో కె.గ్లోరీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


