ఎన్నికల పరిశీలకుడు శేషగిరిబాబు
ఏలూరు (టూటౌన్) : జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమ లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎం.వెంకట శేషగిరిబాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఖర్చులపై కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి శేషగిరిబాబు, ఎన్నికల వ్యయ పరిశీలకుడు జి.శేఖర్‌బాబు సమీక్షించారు. శేషగిరిబాబు మా ట్లాడుతూ కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌కు అందే ఫిర్యాదులను నమోదు చేసి, పరిష్కార ని మిత్తం సంబంధిత అధికారులకు పంపాలన్నా రు. నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌నకు సర్వం సిద్ధం చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాల న్నారు. వ్యయ పరిశీలకుడు శేఖర్‌బాబు మాట్లాడుతూ అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి లెక్కించాలన్నారు. అభ్యర్థుల ప్ర చార ఖర్చులు, సభలు, సమావేశాలు నిర్వహ ణ, ఇంటింటికీ ప్రచారం, కరపత్రాలు, గోడప్రతులు తదితర ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖా తాల్లో నమోదు చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ 1న జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేశామన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌ డ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఎం.ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.


