దాడి ఘటనలో నలుగురి అరెస్టు
భద్రాచలం అర్బన్: తల్లీకూతుళ్లపై దాడి ఘటనలో నలుగురు నిందితులను తెలంగాణలోని భద్రాచలం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన కొవ్వాల పద్మ తన కుమార్తె సాహిత్యతో కలిసి భద్రాచలంలోని అశోక్‌నగర్ కాలనీలో ఉంటోంది. సాహిత్య ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరుకు చెందిన రావూరి స్వామితో ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఆయన భార్య లక్ష్మి అనుమానం పెంచుకుంది. గత ఆగస్టు 21న ఆమె, బంధువులు భద్రాచలం వచ్చి సాహిత్యపై రాడ్లు, కర్రలు, చీపుర్లతో దాడి చేశారు. అడ్డుకున్న తల్లిపైనా దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మరుసటి రోజు పద్మ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బొల్లు సంపత్, తెలూరి ఏడుకొండలు, బొల్లు నాగమణి, రావూరి లక్ష్మిలను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
భీమవరం: మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ ఎస్సై రామారావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన బి.హరీష్‌నాయక్‌కు చదువుపట్ల మక్కువ లేకపోవడంతో కొంతకాలం ముంబైలో ఉన్నాడు. కుటుంబసభ్యులు అతడిని బలవంతంగా భీమవరంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. మూడో సంవత్సరం చదువుతున్న హరీష్‌నాయక్... సోమవారం తాను ఉంటున్న ప్రైవేట్ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


