దళిత నేత సీతారామ్‌ అక్రమ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దళిత నేత సీతారామ్‌ అక్రమ అరెస్ట్‌

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

పెనుగొండ: కూటమి ప్రభుత్వ అక్రమాలను, ఇసుక అక్రమ తవ్వకాలను అడుగడుగునా ప్రశ్నిస్తూ అడ్డంకిగా మారిన ఆచంట మండలం కొడమంచిలికి చెందిన మాజీ సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర సీతారామ్‌ను ఆచంట పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. గురువారం పోలీసులు సీతారామ్‌ను భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీతారామ్‌ నకిలీ పట్టాలకు పాల్పడ్డారంటూ కేసు బనాయించి, స్థానిక ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడానికి మరోసారి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్‌జెడ్‌ పరిధిలో నిషేధం ఉన్నా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తుండడంతో, ఆయన పదేపదే అడ్డుతగులుతూ చివరకు హైకోర్టును సైతం ఆశ్రయించి ప్రత్యేక ఉత్తర్వులు (ఆర్డర్‌) తెచ్చుకున్నందుకే అక్రమ అరెస్ట్‌ చేశారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో...

ఆచంట మండలంలో కూటమి ప్రభుత్వ అక్రమాలకు అడ్డుగా నిలుస్తున్నందునే, స్థానిక ఎన్నికల్లో సీతారామ్‌ ఇబ్బందికరంగా మారుతారనే భయంతోనే మరోసారి అరెస్ట్‌ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, నెల రోజుల ముందే కేసు నమోదు చేసి ఎన్నికలకు ముందు అరెస్ట్‌ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. సీతారామ్‌ అరెస్ట్‌ను వారు తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement