బాలోత్సవం నిర్వహణ అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

బాలోత్సవం నిర్వహణ అభినందనీయం

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

బాలోత్సవం నిర్వహణ అభినందనీయం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాలు ఏడు సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ అన్నారు. గురువారం తన కార్యాలయంలో బాలోత్సవ కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. నవంబర్‌ 1న కేపీడీటీ హైస్కూల్‌లో నర్సరీ నుంచి మెడికల్‌ కాలేజీ విద్యార్థుల వరకు 12 అంశాలలో ప్రతిభా ప్రదర్శనలు, డిసెంబర్‌ 5, 6 తేదీల్లో సురేష్‌ చంద్ర బహుగుణ స్కూల్‌లో పాఠశాల విద్యార్థుల కోసం 40 అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కూచిపూడి సత్యనారాయణ వివరించారు. ఏలూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆహ్వాన సంఘం చైర్మన్‌ అడుసుమిల్లి నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కూచిపూడి సత్యనారాయణ, విద్యాశాఖ జిల్లా ఏడీ ఎం. వెంకట అవధాని, ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు, సమన్వయ కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement