దెందులూరులో దౌర్జన్యకాండ | - | Sakshi
Sakshi News home page

దెందులూరులో దౌర్జన్యకాండ

Oct 23 2026 1:15 AM | Updated on Oct 23 2026 1:15 AM

సకల దేవతలకు ఆహ్వానం కూలి పనులకు వెళ్లి..

న్యూస్‌రీల్‌

దౌర్జన్యాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

సకల దేవతలకు ఆహ్వానం
చరాచర సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ.. చినవెంకన్న ఆలయంలో ధ్వజారోహణ వేడుకను వైభవంగా నిర్వహించారు. IIలో u

ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

IIలో u

శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి,ఏలూరు: దెందులూరులో పచ్చమూక బరితెగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారిలో గెలుపే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. ఏకంగా నామినేషన్‌ కేంద్రాన్ని ఆక్రమించి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడం, ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై కర్రలతో దాడి చేయడం, నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేయడం.. చివరికి ఎ మ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దెందులూరు ‘సాక్షి’ టీవీ కంట్రిబ్యూటర్‌పై దాడి చేసి సెల్‌ఫోన్‌ లాక్కుని బరితెగింపు రాజకీయాలకు తెరదీశారు.

తెగబడిన పచ్చమూకలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాష్టీకానికి తెగబడింది. దెందులూరు నియోజకవర్గంలో హింసా రాజకీయాలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం వేదికగా మారింది. గురువారం నామినేషన్లల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. దెందులూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పరిస్థితి కొనసాగింది. నామినేషన్‌ దాఖలు చేస్తే అంతుచూస్తామని హెచ్చరిస్తూ టీడీపీ శ్రేణులు దెందులూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద హల్‌చల్‌ చేశారు. ఈ క్రమంలో దెందులూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి కలెక్టర్‌ వెట్రిసెల్విని కలిసి దెందులూరుతో పాటు నియోజకవర్గ పరిస్థితులపై రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలు తరువాత భారీ పోలీస్‌ బందోస్తు నడుమ 19 ఎంపీటీసీ స్థానాలకుగాను 17 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకోవైపు దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నామినేషన్‌ కేంద్రం వద్ద హడావుడి చేశారు. సాక్షి టీవీ కంట్రిబ్యూటర్‌ ప్రసాద్‌ వీడియో తీస్తుండగా ఆయనపై దాడి చేసి మొబైల్‌ లాక్కున్నారు.

పెదవేగి మండలంలో

వైఎస్సార్‌సీపీ కార్యకర్త తల పగలకొట్టి..

టీడీపీ మూకలు పెదవేగి మండలంలో దాడులకు తెగబడి తలలు పగలకొట్టారు. పెదవేగి మండలంలో నామినేషన్‌కు ర్యాలీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకుని కర్రలతో దా డులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త చాపల దుర్గారావు తలపగిలి చికిత్స పొందుతున్నాడు. అలాగే న్యాయంపల్లి గ్రామానికి చెందిన బలుసు సాయిపై దాడికి దిగి చొక్కా చించేశా రు. దీంతో పార్టీ కార్యకర్తలతో కలిసి కొంతసేపు ఆయన ఆందోళన నిర్వహించారు. అలాగే ఏలూరు జిల్లాపరిషత్‌ కార్యాలయంలోని ఏలూరు రూరల్‌ మండల కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. రూరల్‌ మండలంలోని కలకుర్రు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దుల రత్తయ్య నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు జాన్‌, జోషి పోలీసుల సమక్షంలోనే నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించి పారిపోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ అరాచకపర్వం

పచ్చమూకల బరితెగింపు

పెదవేగిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

నామినేషన్‌ ర్యాలీని అడ్డగించిన పచ్చ శ్రేణులు

దెందులూరులో నామినేషన్‌ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఎమ్మెల్యే వర్గం

‘సాక్షి’ టీవీ కంట్రిబ్యూటర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని

వైఎస్సార్‌సీపీ కలకుర్రు ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్లు చించివేత

ఏలూరు (టూటౌన్‌): దెందులూరు నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా జరుగుతున్న తాజా పరిణామాలు, అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్విని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్‌ మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా అడ్డుకుంటున్నారని, కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను బలవంతంగా తీసుకొని ధ్వంసం చేసినట్టు ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులకు పూర్తిస్థాయి పోలీసు భద్రత కల్పించాలని, నిర్ణీత గడువులోగా నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీ సుకోవాలని కోరారు. అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం, నా మినేషన్‌ పత్రాలను లాక్కోవడం లేదా ధ్వంసం చేయడం వంటి ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపె చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఘటనలకు సంబంధించిన ఫిర్యాదు లు, సాక్షుల వివరాలు, అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ తదితర ఆధారాలను భద్రపరచాలని కోరారు. పెదవేగి, పెదపాడు, దెందు లూరు,ఏలూరు రూరల్‌ మండలాల్లో అవసరమైన అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసి, ప్రతి అభ్యర్థి తన నామినేషన్‌ను స్వేచ్ఛగా దాఖలు చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement