ఏలూరు (టూటౌన్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీ కరణ ప్రక్రియలో ఎక్క డా శాంతిభద్రతల సమ స్య తలెత్తకూడదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. శుక్రవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని, ఆయా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, ఎక్కడైనా పొరపాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎం.కృష్ణమోహన్, ఆర్డీఓలు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద.. పరిషత్ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ ఏర్పాట్లపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఏలూరు టౌన్/దెందులూరు: జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చేపట్టేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామనీ జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ చెప్పారు. గురువారం నామినేషన్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు సమర్పించాలని, ఎవరైనా బెదిరింపులు, దాడులు, ఇబ్బందులకు గురిచేస్తే పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. సీఐ ఎం. సుబ్బారావు ఇన్‌చార్జిగా ఉంటారని, సెల్ 9550351100కు లేదా 112కు కాల్ చేయవచ్చన్నారు. ప్రజాస్వామ్య విధానంలో నామినేషన్ల ప్రక్రియ సాగేలా రాజకీయ నేతలు సహకరించాలని కోరారు. జిల్లాలో ఏడు ఫిర్యాదులు అందాయనీ, తక్షణమే అప్రమత్తమైన శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారని చెప్పారు.
అడ్డంకులు సృష్టిస్తే చర్యలు
ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినా, నామినేషన్లకు అడ్డంకులు సృష్టించినా ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. ఏలూరులో, దెందులూరు, పెదవేగి ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఉన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తురాలి కుటుంబం గురువారం రూ.3 లక్షలను విరాళంగా అందించారు. జంగారెడ్డిగూడేనికి చెందిన విష్ణుభట్ల అనసూయ ముందుగా కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాత కుటుంబానికి ఈఓ వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్ అందజేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరుకు చెందిన జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో ఏలూరు మేయర్ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ప్రజారవాణా శాఖ అధికారులు తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


