దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం ఖూనీ

Oct 23 2026 1:15 AM | Updated on Oct 23 2026 1:15 AM

దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం ఖూనీ

ఏలూరు టౌన్‌/దెందులూరు: రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లు, అరాచకాలతో స్థానిక సంస్థల ఎన్నికలను రక్తసిక్తం చేస్తున్నారనీ... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేలా టీడీపీ కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ దెందులూరు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో పెదవేగి ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి ఏలూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త చేపల దుర్గారావును ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అండగా ఉంటామనీ అధైర్యపడొద్దని దుర్గారావుకు అభయమిచ్చారు. అనంతరం అబ్బయ్య మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు నామినేషన్లు వేయ కుండా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ, దుర్గారావుపై దాడి చేయటంతో తీవ్ర గాయాల య్యాయన్నారు. ఓటమి భయంతో దాడులు చే యటం, నామినేషన్లను అడ్డుకోవటం సిగ్గుచేటన్నా రు. జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, పార్టీ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement