బెదిరించి.. భయపెట్టి.. | - | Sakshi
Sakshi News home page

బెదిరించి.. భయపెట్టి..

Oct 22 2026 1:09 AM | Updated on Oct 22 2026 1:09 AM

న్యూస్‌రీల్‌

కూటమి అరాచక పర్వం

● ప్రశాంత పశ్చిమలో బెదిరింపుల సంస్కృతి

● ఉండి నియోజకవర్గంలో కూటమి దౌర్జన్యకాండ

● ఆకివీడు నగర పంచాయతీ అభ్యర్థులకు బెదిరింపులు

● వ్యాపారాలను విధ్వంసం చేస్తామని హెచ్చరికలు

● ఊళ్లో తిరగనీయమంటూ కూటమి నేతల హడావుడి

● 8 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థుల ఉపసంహరణ

గురువారం శ్రీ 22 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశాంత పశ్చిమలో కొత్త సంస్కృతికి తెలుగుదేశం పార్టీ బీజం వేసింది. ఇప్పటివరకు ఎక్కడా బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు జిల్లాలో లేవు. ఏళ్ల తరబడి పార్టీలకు అతీతంగా అందరూ ఉంటూ, హుందాగా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త సంస్కృతికి తెరతీసింది. డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో టీడీపీ నేతలు ఆకివీడు నగర పంచాయతీ అభ్యర్థులపై బెదిరింపులకు దిగారు. వ్యక్తిగత ఆస్తినష్టాలు మొదలు, వ్యాపారాల విధ్వంసాల వరకు పలు రకాలుగా ఫోన్లల్లో భయపెట్టి, వ్యక్తిగతం కలిసి హెచ్చరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఆకివీడులో హైడ్రామా

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం పూర్తయింది. ఈ క్రమంలో ఉదయం నుంచి ఆకివీడులో హైడ్రామా కొనసాగింది. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఆకివీడు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మన్నే లలితాదేవిని మొదలు కౌన్సిలర్‌ అభ్యర్థుల వరకు అందరినీ బెదిరించారు. అంతటితో ఆగకుండా టీడీపీ నేతలు వెంటపడి వేధించిన తరహాలో ఫాలోఅప్‌ చేసి మరీ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. మూడు రోజుల క్రితమే ఉండి వైఎస్సార్‌సీపీ నేత వేగేశ్న వెంకటరాజును వ్యాపారం కోణంలో బెదిరించి పార్టీకి రాజీనామా చేయించారు. ఇక తాజాగా ఆకివీడు 2వ వార్డు అభ్యర్థిని మొటుపల్లి రామాంజనేయులు, 4వ వార్డు అభ్యర్థి పైడి రాజేష్‌, 7వ వార్డు అభ్యర్థి కె.శ్రీనివాసరావు, 8వ వార్డు అభ్యర్థి నిమ్మల ద్వారాకనాథ్‌, 12వ వార్డు అభ్యర్థి గుండుగొలను సావిత్రి, 18వ వార్డు అభ్యర్థి కె.సుజాత, 20వ వార్డు అభ్యర్థి జిల్లా పెద్దిరాజు, 5వ వార్డు అభ్యర్థి తిప్పా దుర్గాభవానీ తదితరులను బెదిరించి కొన్ని గంటల పాటు నిరంతరం వేధించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. 18వ వార్డుకు చెందిన కె.సుజాత చేపల మార్కెట్‌లో వ్యాపారం చేస్తుండగా.. షాపు లేకుండా చేస్తామని ఆమెను బెదిరించారు. 8వ వార్డు అభ్యర్థి భీమవరంలో చేసే వ్యాపారాన్ని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇక 20 వార్డు అభ్యర్థి పెద్దిరాజు మాంసం దుకాణం నిర్వహిస్తుండగా.. ఉదయం నుండి ఆయన్ను తీవ్రస్థాయిలో వేధించి ఉపసంహరించుకునేలా చేశారు.

విష సంస్కృతికి బీజం

ప్రశాంత, హుందా రాజకీయాలకు పశ్చిమగోదావరి పెట్టింది పేరు. జిల్లాలో అనేక సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా ఈ తరహా దౌర్జన్యాలు, బెదిరింపులు లేవు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాతే పశ్చిమలో విష సంస్కృతికి బీజం వేశారు. గతేడాది అత్తిలి ఉప ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంపైకి టీడీపీ శ్రేణులు దూసుకువచ్చే ప్రయత్నం చేసి నానారచ్చ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు అన్నిచోట్లా, అన్ని పార్టీలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియలో ఉండగా ఉండిలో మాత్రమే ఈ తరహా దౌర్జన్యకాండను టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement