‘పరిషత్‌’ పోరు షురూ | - | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’ పోరు షురూ

Oct 22 2026 1:09 AM | Updated on Oct 22 2026 1:09 AM

ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు, ముదినేపల్లి జెడ్పీటీసీగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామిశెట్టి వీరవెంకట సత్యనారాయణ

సాక్షి ప్రతినిధి,ఏలూరు: జిల్లాలో పరిషత్‌ పోరు షురూ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రారంభమైంది. జిల్లాపరిషత్‌ కార్యాలయాల్లో జెడ్పీటీసీలు, మండల కేంద్రాల్లో ఎంపీటీసీల నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మొత్తంగా రెండు జిల్లాల్లో 47 జెడ్పీటీసీ స్థానాలకు 18 నామినేషన్లు, 825 ఎంపీటీసీ స్థానాలకు 414 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఏలూరు జిల్లాలో.. ఏలూరు జిల్లాలో 454 ఎంపీటీసీ స్థానాలకు 222 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 86 మంది, టీడీపీ నుంచి 92 మంది, జనసేన నుంచి 23 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, సీపీఎం నుంచి ఒకరు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, 13 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకుగాను తొలిరోజు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 3, టీడీపీ నుంచి 3, సీపీఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్‌ దాఖలు చేశారు.

పశ్చిమలో.. పశ్చిమగోదావరి జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు 10 నామినేషన్లు దాఖలుకాగా వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు నాలుగు సెట్లు, టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు నామినేషన్‌ దాఖలు చేశారు. అ లాగే జిల్లాలో 371 ఎంపీటీసీ స్థానాలకు 192 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ నుంచి 95, టీడీపీ నుంచి 52, జనసేన నుంచి 32, బీ జేపీ నుంచి 4, బీఎస్‌పీ నుంచి 2, ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణ

ఏలూరులో 454 ఎంపీటీసీ స్థానాలకు 222 నామినేషన్లు

27 జెడ్పీటీసీ స్థానాలకు 8 నామినేషన్లు

పశ్చిమలో 371 ఎంపీటీసీ స్థానాలకు 192 నామినేషన్లు

20 జెడ్పీటీసీ స్థానాలకు 10 నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement