నూజివీడు: పరిషత్ ఎన్నికల్లో భాగంగా నూజి వీడు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల నిమిత్తం చేసిన ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. 20 ఎంపీటీసీ స్థానాలకు కేవలం మూడు కౌంటర్లను అదీ ఇరుకు గదుల్లో ఏర్పాటు చేయడంపై రిటర్నింగ్ అధికారి రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాల్సి ఉండగా 11 గంటల తర్వాత ఏర్పాట్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. అభ్యర్థులకు ఎలాంటి అ సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయినా కూర్చోవడానికి కూడా సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంపై అ భ్యర్థులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం(చింతలపూడి): స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లను ఆర్డీఓ రమణ బుధవారం పరిశీలించారు. ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తున్నామన్నారు. భారీ బందోబస్తు నడుమ పారదర్శకంగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ చర్యలు చేపట్టామన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తహసీల్దార్ స్లీవ జోజి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మిరియాల వెంకట శేషగిరిబాబు ఆదేశించారు. నగరపాలక, పురపాలక సంఘాల పోలింగ్, కౌంటింగ్, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల సంసిద్ధతపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఎన్నికల అధికారులు, సిబ్బందితో బుధవారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ఈనెల 28న ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు ఎన్నికల పోలింగ్ జరగనున్న దృష్ట్యా బాలెట్ పత్రాల ముద్రణకు చర్యలు తీసుకోవాలని, పోలింగ్‌కు సంబంధించి పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు వంటి ప్రాథమిక కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌కు ముందురోజు పోలింగ్ సామాగ్రి అందించేందుకు పంపిణీ కేంద్రాలు సిద్ధం చేయాలనీ, పోలింగ్ సామాగ్రి, సిబ్బందిని పోలింగ్ స్టేషన్లకు తర లించేందుకు వాహనాలు ఏర్పాటు, వాటికి సంబంధించిన రూట్ మ్యాప్‌ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్త్, భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రవిబాబు బుధవారం పట్టణంలోని ప్రైవేట్, వైద్య నిర్ధారణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కావ్య డయోగ్నోస్టిక్స్, దొరశ్రీ ఫిజియోథెరపి క్లినిక్‌లను పరిశీలించి కేంద్రాల రిజిస్ట్రేషన్, అనుమతి పత్రాలు, సిబ్బంది అర్హతలు, నిబంధనలు తదితరాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నిబంధనలకు విరుద్ధంగా నడిచే క్లినిక్‌లు, డయోగ్నోస్టిక్స్ సెంటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. అర్హత కలిగిన టెక్నీషియన్లు, నిపుణులు సమక్షంలోనే పరీక్షలు, చికిత్సలు జరగాలన్నారు. జిల్లావ్యాప్తంగా మరిన్ని సోదాలు చేస్తామన్నారు.


