● 62 డివిజన్లలోనూ విజయానికి పాటుపడాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
ఏలూరు టౌన్: ఏలూరు నగరపాలక సంస్థను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవటం ఖాయమనీ.. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు (జీఎంఆర్) విజయంతోపాటు, నగరంలోని 62 డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ నాయకత్వంలో మంగళవారం పార్టీ కార్యాలయం వద్ద ఏలూరులో మేయర్ అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చామనీ, కొందరికి కార్పొరేటర్ సీటు కేటాయించలేకపోయామనీ వారికి సముచిత స్థానం కల్పి స్తామని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామనీ, తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో ఆయన ఆదేశాలతోనే ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు మేయర్ అభ్యర్థి జీఎంఆర్, కార్పొరేటర్ అభ్యర్థులు కృషి చేస్తారని చెప్పారు. కూటమి పాలనలో ఈ రెండున్నరేళ్లలో కార్పొరేషన్‌లో సుమారు రూ.3 కోట్ల వరకూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. తాము నగరంలో తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు నిర్మాణం, వంటి కీలక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామమని అన్నారు.
పనిచేసే నాయకులకే ఓటేయండి
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ నగరంలో 62 డివిజన్లలోనూ ప్రజలకు సేవ చేసే నాయకులకే సీటు ఇచ్చామని, ప్రజ లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ పనిచేసే నాయకులకు ఓటు వేయాలని కో రారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన తరహాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పా లన చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు నగర అఽ ద్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, మహిళ అధ్యక్షులు జిజ్జువరపు విజయనిర్మల, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు డింపుల్‌జాబ్, 62 మంది డివిజన్ అభ్యర్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.


