ఏలూరు టౌన్: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం పోలీసుల అమరవీరుల దినం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ అమరవీరుల స్మృతివనం వద్ద కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీ శివకిషోర్‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ, వ్యాధి తీవ్రత ఆధారంగా బందోబస్తుల నుంచి ఉపశమనం కలిగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీస్ అధికారుల, సిబ్బంది సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎందరో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అసాంఘిక శక్తులతో పోరాడుతున్నారన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వపరమైన సహాయ, సహకారాలకు తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ విధు ల్లో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అధికారులు, సి బ్బంది కుటుంబాలకు భరోసాగా నిలుస్తామని హా మీ ఇచ్చారు. అర్హులైన కుటుంబ సభ్యులకు కలెక్టర్, రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ సహాయ సహకారంతో కారుణ్య నియామకాలు చేపట్టేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు అమరవీరుల పేర్లు చదివి శ్రద్ధాంజలి ఘటించారు. అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్‌కుమా ర్ రెడ్డి, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, వన్‌టౌన్ సీఐ కె.రామకృష్ణ, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, టూటౌన్ సీఐ అశోక్‌కుమార్, ట్రాఫి క్ సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


