ఆకివీడులో గెలిచి తీరుతాం | - | Sakshi
Sakshi News home page

ఆకివీడులో గెలిచి తీరుతాం

Oct 22 2026 1:09 AM | Updated on Oct 22 2026 1:09 AM

ఆకివీడులో గెలిచి తీరుతాం

ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌, వార్డు అభ్యర్థులు అధిక స్థానాల్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి మంతెన యోగీంద్రకుమార్‌ తెలిపారు. స్థానిక పార్టీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ ధన బలం, అంగబలంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని బెదిరించినా, ఒత్తిళ్లకు గురిచేసినా అధిక శాతం మంది పోటీలో నిలబడ్డారన్నారు. ప్రతి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. నగర పంచాయతీ కార్యాలయంపై రెండోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా అంకితభావంతో నాయకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. రానున్నది జగనన్న ప్రభుత్వమేనని ప్రజలకు చెప్పాలన్నారు. నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని మన్నే లలితాదేవి, నగర పంచాయతీ మాజీ చైర్‌పర్సన్‌ జామి హైమావతి, ఎండీ మస్తాన్‌ వలీ, జగ్గురోతు విజయ్‌కుమార్‌, మోరా జ్యోతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, షేక్‌ హుస్సేన్‌, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్‌, అట్లూరి రంగారావు, పడాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement