ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం బుధవారం భవానీ దీక్షాదారులతో ఎరుపెక్కింది. దేవీ శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులంతా ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ పరిసరాలు భవానీలు, సాధారణ భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపాలు, పరిసర ప్రాంతాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపై ఎక్కడ చూసినా భవానీ దీక్షాదారులే కనిపించారు.


