టీడీపీకి ఝలక్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఝలక్‌

Oct 22 2026 1:09 AM | Updated on Oct 22 2026 1:09 AM

టీడీపీకి ఝలక్‌

పెనుగొండ : స్థానిక ఎన్నికల వేళ అధికార టీడీపీకి ఆపార్టీ నాయకులు ఝలక్‌ ఇచ్చారు. బుధవారం రాత్రి పెనుగొండ దొంగ గూడెంలో టీడీపీ నాయకులు మూకుమ్మడిగా మాజీ ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు(పెద్ద) సమక్షంలో వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకొన్నారు. వైఎస్సార్‌ సీపీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు దంపనబోయిన దుర్గారావు, దంపనబోయిన లీలావతి, పూతినీడి దుర్గారావు, పూతినీడి సోమేశ్వరరావు, పూతినీడి సత్తిరాజు, ఆది, పూతినీడి సోమేశ్వరరావు(ఆంజనేయులు), పూతినీడి నరేష్‌, పూతినీడి హరిబాబు, పూతినీడి పేర్రాజు, పూతినీడి సత్తికొండ, పూతినీడి సత్యనారాయణ, పూతినీడి రామకృష్ణ, బాలం సత్యనారాయణ, విత్తనాల ఏసు, పూతినీడి గోవింద, పూతినీడి నాగిశెట్టి, పూతినీడి భాస్కరావు, పూతినీడి రుద్రాంజనేయులు ఉన్నారు. కార్యక్రమంలో పంచాయతీ మాజీ సభ్యులు పిల్లి చాముండి, పూతినీడి శ్రీను, వెలగల శ్రీనివాస రెడ్డి, ఎస్సీ సెల్‌ కన్వీనరు పలివెల శ్రీను, పార్టీ నాయకులు సుంకర నాగబాబు,గుడాల ఏసు, నాగిశెట్టి నరసింహరావు, నాగిశెట్టి , బళ్ల పోలరాజు, నరేంద్ర, బాలం సత్తిపండు,బాబీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement