ఆర్కే బీచ్‌లో మహిళను కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ఆర్కే బీచ్‌లో మహిళను కాపాడిన పోలీసులు

Oct 22 2026 1:09 AM | Updated on Oct 22 2026 1:09 AM

ఆర్కే బీచ్‌లో మహిళను కాపాడిన పోలీసులు వృద్ధుడి అదృశ్యం

బీచ్‌రోడ్డు: ఆర్కే బీచ్‌లో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు, జీవీఎంసీ స్విమ్మర్‌ చాకచక్యంగా కాపాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పి.పావని బుధవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆర్కే బీచ్‌కు వచ్చారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో బీట్‌ డ్యూటీలో ఉన్న పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఎస్‌ఎంఎస్‌వీ శ్రీనివాస్‌, జీవీఎంసీ స్విమ్మర్‌ ఆనంద్‌ వెంటనే అప్రమత్తమై ఆమెను కాపాడి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనిపై డయల్‌ 112కు సమాచారం అందించడంతో పాటు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషనన్‌కు నివేదించినట్టు పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో చెప్పారు. మానసిక ఆందోళన కారణంగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఖిలా వరంగల్‌: దసరా ఉత్సవాలకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఏలూరు కలిదండి మండలం పెదలంకకు చెందిన పోకల సూర్యనారాయణ దసరా ఉత్సవాలకు ఇటీవల వరంగల్‌ నగరంలోని రంగశాయిపేటలో ఉంటున్న కొడుకు దగ్గరకు వచ్చాడు. మంగళవారం మహకాంళి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఉత్సవాలను వీక్షించేందుకు కొడుకు ఇంటి నుంచి బయయల్దేరాడు. రాత్రి కూడా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రోజంతా చుట్టు పక్కల బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. సూర్యనారాయణ మనవరాలు రంగశాయిపేటకు చెందిన దుగ్గిరాల శ్రీవిద్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement