గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి గల్లంతు

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి గల్లంతు ముగిసిన సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ క్వాలిఫైడ్‌ పోటీలు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైర్ల చోరీ.. నిందితులను పట్టుకున్న రైతులు

యలమంచిలి: మండలంలోని ఏనుగువానిలంక గ్రామానికి చెందిన ఇనుకొండ వెంకట సత్యనారాయణ (55) చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడని ఆయన భార్య మణికుమారి తెలిపారు. మృతునికి వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని యలమంచిలి పోలీసులు తెలిపారు.

యలమంచిలి: ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ క్వాలిఫైయింగ్‌ పోటీల మెయిన్‌ డ్రాకు మొత్తం 96 మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బూన్‌రాజు తెలిపారు. సీహెచ్‌ బుద్ధావతారంరాజు మెమోరియల్‌ ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ క్వాలిఫైయింగ్‌ పోటీలు శుక్ర, శనివారాల్లో పాలకొల్లు కాస్మో కల్చరల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ టోర్నమెంట్‌ మెయిన్‌ మ్యాచ్‌లు ఈ నెల 18వ తేదీన ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. సింగిల్స్‌ విభాగంలో 96 మంది, డబుల్స్‌ విభాగంలో 48 మంది క్రీడాకారులు మెయిన్‌ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ప్రధాన పోటీలు పాలకొల్లు టౌన్‌హాల్‌తో పాటు నరసాపురం ఆఫీసర్స్‌ క్లబ్‌ టెన్నిస్‌ కోర్టులో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో 45, 55, 65, 70, 75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజెన్లు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో ఉత్సాహంగా పోటీ పడతారని బూన్‌రాజు వివరించారు.

కామవరపుకోట: మండలంలోని రామన్నపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ రైతు పొలంలో భూగర్భంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ వైర్లను అక్రమంగా వెలికితీస్తున్న వ్యక్తులను రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపాలెం సమీపంలోని పొలంలో భూమిని తవ్వి బీఎస్‌ఎన్‌ఎల్‌ వైర్లను తొలగిస్తుండగా అటుగా వెళ్తున్న రైతులు గమనించారు. వారిని ప్రశ్నించగా కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన కొంతమందిని రైతులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించడంతో, తడికలపూడి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇలాంటి సంఘటనలు గతంలోనూ చాలా జరిగాయని, ఇవి బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల ప్రమేయం లేదా వారికి తెలిసే జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తడికలపూడి పోలీసులను వివరణ కోరగా.. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement