ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

రైతుల ఆందోళన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

రైతుల ఆందోళన
గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని లింగపాలెం మండలానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 8లో u

ఇన్‌చార్జి కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవరం ప్రాజెక్ట్‌ పునరావాస కాలనీ తాడువాయిలో నిర్మిస్తున్న 647 ఇళ్ల నిర్మాణాలను ఈ నెలాఖరుకు పూర్తి చేసి నిర్వాసితులను తరలించాలని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీకి మారే వారికి కొత్త ప్రాంతంలోనూ పింఛన్లు, రేషన్‌, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం పోలవరం ప్రాజెక్ట్‌ పునరావాసం, భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, ఈపీడీసీఎల్‌ ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కేఎం అంబేడ్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

1,554 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం

జిల్లాలోని 27 మండలాల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించి 1,554 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ కె.అభిషేక్‌ గౌడ తెలిపారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయ నోటీస్‌ బోర్డులో జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ ఇన్‌చార్జ్‌ సీఈఓ మల్లికార్జునరావు పోలింగ్‌ కేంద్రాల జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. 27 మండలాల పరిధిలోని 454 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితా, పురుషులు, మహిళలు, ఇతరుల ఓటర్ల వివరాలను మండలాల వారీగా సిద్ధం చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement