సుద్దముక్కకూ సొమ్ముల్లేవ్‌ | - | Sakshi
Sakshi News home page

సుద్దముక్కకూ సొమ్ముల్లేవ్‌

Aug 27 2026 1:00 AM | Updated on Aug 27 2026 1:00 AM

సుద్దముక్కకూ సొమ్ముల్లేవ్‌

ఐటీడీఏ పరిధిలో 143 పాఠశాలలు

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల

బుట్టాయగూడెం : ప్రభుత్వ పాఠశాలల్లో సుద్ద ము క్కలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. పాఠశాల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వ హణకు నిధులు విడుదల కాకపోవడంతో ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల జేబుల్లోంచి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి నిధుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యాంశాలు చెప్పేందుకు బోర్డుపై రాయడానికి కూడా ఒక్క సుద్ద ముక్క కూడా లేని పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరానికి తన సొంత డబ్బులతో ఒక డజను తెప్పించి పాఠ్యాంశాలు చెబుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లుగా హెచ్‌ఎంలపైనే భారం

పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపైనే పడుతుంది. మరుగుదొడ్లు శుభ్రం చెయ్యడానికి ఫినాయిల్‌, బ్లీచింగ్‌ కొనడానికి, కరెంట్‌ బిల్లులు కట్టడానికి కూడా నిధులు లేకపోవడంతో పలు చోట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులను పెట్టి నడుపుతున్న పరిస్థితి నెలకొందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా ఒక్క రూపాయి కూడా రాలేదని ఈ ఏడాది కూడా పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నిధులు జమ కాలేదని దీంతో పాఠశాలల్లోని ఖాతాల్లో నిధుల నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఏప్రిల్‌, మే నెలల్లోనే పాఠశాల కంపోజెంట్‌ నిధులు విడుదల కావాల్సి ఉంది. ఆ నిధులను ఒక్కో పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.5 వేలు, రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకూ సర్వశిక్షా అభియాన్‌ పథకంలో ఇస్తారు. ఈ నిధులతోనే సుద్ద ముక్కలు, డస్టర్‌లు, రిజిస్టర్‌లు, మరుగుదొడ్ల శుభ్రత, చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నిధుల విషయం పట్టించుకోకపోవడంతో పాఠశాలల నిర్వహణ పరిస్థితి అధ్వానంగా మారింది.

చతికిల‘బడి’

విడుదల కాని పాఠశాల నిర్వహణ నిధులు

ప్రతిపాదనలు బుట్టదాఖలు

ప్రధానోపాధ్యాయులపైనే భారం

ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

ఐటీడీఏ పరిధిలోని 143 పాఠశాలల్లో పాఠశాలల, మరుగుదొడ్ల నిర్వహణ మరింత అధ్వానంగా మారింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా పాఠశాల ఖాతాల్లోకి రెండేళ్లుగా నిధులు జమ కాకపోవడంతో పాఠశాల నిర్వహణకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ పరిధిలో 25 గిరిజన సంక్షేమ పాఠశాలలు, 144 జీపీఎస్‌ పాఠశాలలు, 4 గురుకుల పాఠశాలలు ఒక ఏకలవ్య పాఠశాల నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 7,880 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి పాఠ్య బోధనకు, మరుగుదొడ్ల నిర్వహణకు ఉపాధ్యాయులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. అలాగే ప్రభుత్వ తీరుపట్ల ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చెయ్యాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement