కై కలూరు: క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలుగా నిలుస్తాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. ముదినేపల్లి మండలం చిగురుకోటకు చెందిన కోమటి వెంకట కృష్ణారెడ్డి జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ చూపి ఏషియన్ మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు దేశం తరఫున అర్హత సాధించారు. ఈ నేపథ్యలో బుధవారం ఆయన సాధించిన పతకాలతో కై కలూరులో డీఎన్నార్ నివాసంలో మర్వాదపూర్వకం కలిశారు. డీఎన్నార్ ఆయన్ను ఘనంగా సన్మానించారు. వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి 2006 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు పతకాలు సాధించానని, ఇటీవల విజయవాడలో కృష్ణా రివర్ క్రాసింగ్‌లో పాల్గొన్నానన్నారు. ఢిల్లీలో మూడు కిలోమీటర్ల దూరాన్ని గంట 33 నిమిషాల 39 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానం సాధించానని చెప్పారు. ఏ లూరు జిల్లా తరఫున పల్నాడులో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో రెండు పతకాలు సాధించానన్నారు. అక్టోబరులో బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం గర్వంగా ఉందన్నారు.వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి, ముదినేపల్లి మండల ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, డీఎన్నార్ కుమారుడు దూలం వినయ్, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బత్తిన కిషోర్, జిల్లా పంచాయతీ రాజ్ ప్రధాన కార్యదర్శి శీలం రామకృష్ణ, అయ్యవారి రుద్రవరం, పెరికేగూడెం మాజీ సర్పంచ్‌లు బోణం శేషగిరి, పెరుమాళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.


