12న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌అదాలత్‌

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

బాలికల ఆచూకీ లభ్యం 12న జాతీయ లోక్‌అదాలత్‌

బాలికల ఆచూకీ లభ్యం
ఉండిలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ విశాఖలో లభించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 8లో u

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ లోక్‌ అదాలత్‌ల ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారానికి పోలీస్‌ అధికారులు కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి కోరారు. స్థానిక జిల్లా కోర్టులో ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వచ్చేనెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్‌ కేసులను రాజీ చేస్తామన్నారు. కక్షిదారులు సంబంధిత పోలీసు అధికారులను లేదా న్యాయస్థానాలను సంప్రదించవచ్చన్నారు. కేసుల పరిష్కారంలో సలహాల కోసం 15100 ద్వారా సంప్రదించవచ్చన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement