మేం నాయకులం కాదా ?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కై కలూరులో కూటమి కుమ్ము లాటలు తారాస్థాయికి చేరాయి. నామమాత్రపు ప్రాధాన్యత లేదని జనసేన.. బలంగా ఉన్న తమకు నామినేట్‌లో ప్రాధాన్యం లేదని టీడీపీ.. దశాబ్దాలుగా కాషాయ జెండా మోస్తున్న తమను ఉద్దేశపూ ర్వకంగా విస్మరిస్తున్నారని బీజేపీ నేతలు ఇలా కూ టమిలోని మూడు పార్టీల నేతలు అసమ్మతి గళం విప్పుతున్నారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన శ్రేణులు పోటాపోటీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఎమ్మెల్యే కామినేని, నాలుగు మండలాలకు నలుగురు నేతలు నియోజకవర్గంలో హవా సాగిస్తుండటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది.
తారాస్థాయిలో అసమ్మతి
కై కలూరు నియోజకవర్గంలో కూటమి పార్టీల అసమ్మతి రోజురోజుకూ పెరుగుతుంది. ప్రధానంగా ఎమ్మెల్యే కామినేని ఏకపక్ష తీరుపై సొంత పార్టీల నేతలను సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తనకు సన్నిహితంగా ఉండే నలుగురు నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించడం సదరు నేతల నుంచి ఫోన్ వస్తేనే పనులు చేయాలని తహసీల్దార్ కార్యాలయం మొదలు పోలీస్‌స్టేషన్ల వరకు ఆదేశాలు ఇవ్వడంతో మూడు పార్టీల నేతలు అగచాట్లకు గురవుతున్నారు. సీనియర్ నేత పేరుతో నిత్యం జిల్లాలో హడావుడి చేసే కామినేని నియోజకవర్గంలో త క్కువ సమయంలో అందుబాటులో ఉండటం, ఏ పని జరగాలన్నా నలుగురు నేతల అనుమతి తప్పనిసరి కావడంతో శ్రేణులు రగిలిపోతున్నారు. పే రుకు బీజేపీ ఎమ్మెల్యే అయినా మండల, నియోజకవర్గ స్థాయి నేతలకు కై కలూరులో ప్రాధాన్యం నిల్‌గా మారింది. కామినేనికి సన్నిహితంగా ఉండే సొంత సామాజికవర్గ టీడీపీ నేతలు చాపరాల దుర్గాప్రసాద్ (మండవల్లి), చల్లగోళ్ల శోభనాద్రిచౌదరి (ముదినేపల్లి), వల్లభనేని శ్రీనివాస్ చౌదరి (కలిదిండి), కై కలూరులో ఓసీ వర్గానికి చెందిన పెరిచర్ల ప్రసాదరాజు పూర్తి హవా సాగిస్తున్నారు. అక్రమ మైనింగ్, కోడిపందాలు, పేకాట వరకు అన్నింటికీ ఈ నలుగురి అనుమతే కీలకంగా మారింది. మూ డు పార్టీల ముఖ్య నేతలు ఎవరైనా గాని చిన్నపాటి పని జరగాలంటే ఈ నలుగురు నేతలతో తప్పనిసరిగా సిఫార్సు చేయించుకోవాల్సిన పరిస్థితి. దీంతో రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇటీవల కట్టలు తెంచుకుంది.
ఇన్‌చార్జులు కరువు
మరోవైపు కామినేనికి లబ్ధి చేకూర్చే యోచనలో జనసేన, టీడీపీ రెండు పార్టీలు నియోజకవర్గానికి గత రెండేళ్లుగా ఇన్‌చార్జులను నియమించని పరిస్థితి. రాష్ట్రంలో టీడీపీ ఇన్‌చార్జి లేని తక్కువ నియోజకవర్గాల్లో కై కలూరు మొదటి స్థానంలో ఉంటుందని ఆ పార్టీ నేతలే బహిరంగా విమర్శిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి కార్యకలాపాలు నడిపే ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఏమి జరగని పరిస్థితి. ఇక జనసేనదీ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. 2024 ఎన్నికల సమయంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం ఇప్పటికీ భర్తీ కాలేదు. ఇక పొత్తు ఉంటేనే నియోజకవర్గంలో రాజకీయం చేసే కామినేని కా కుండా కొందరు బీజేపీ నేతలు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా చిన్నపాటి నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీకి న్యాయం జరగకపోవడం గమనార్హం. అలాగే ఇటీవల బీజేపీ ఎ మ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నామమాత్రంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
కై కలూరు కూటమిలో కుమ్ములాటలు
కామినేని, టీడీపీ నేతలదే పెత్తనం
తమను పట్టించుకోవడం లేదని జనసేన నాయకుల కినుక
ఉనికి కోల్పోతున్నామంటున్న బీజేపీ నేతలు
సీఎం పర్యటన సాక్షిగా టీడీపీ, జనసేన పోటాపోటీ సమావేశాలు
ఈనెల 10న కలిదిండిలో సీఎం చంద్రబాబు అధికారిక కార్యక్రమాల అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. దీనికి పోటీగా జనసేన నేతలు అదే మండలంలోని సానరుద్రవరంలో సమావేశం ఏర్పాటు చేసి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆహ్వానించి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చే శారు. పార్టీకి కేడర్, ఓటింగ్, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నా పోలీస్‌స్టేషన్‌లో చిన్నపాటి పనికూడా కావడం లేదని, ఎమ్మెల్యే కామినేని అసలు పట్టించుకోవడం లేదంటూ బహిరంగంగా విరుచుకుపడ్డారు. ముదినేపల్లి, కలిదిండి మండలాల్లో జనసేన నేతలు తహసీల్దార్ కార్యాలయాలకు, పోలీస్‌స్టేషన్లకు వెళితే కామినేని ఏర్పాటుచేసిన నలుగురు టీమ్‌లో వారితో చెప్పించాలని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణకు కూడా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. నలుగురు నేతలు, అధికారుల తీరుపై జనసేన కార్యకర్తలు ఏకరువు పెట్టారు. ఇది జరిగి పది రోజులు దాటినా నియోజకవర్గంలో యథాస్థితిలో రాజకీయం కొనసాగడం గమనార్హం.


