ముగిసిన సీబీఎస్‌ఈ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సీబీఎస్‌ఈ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

Aug 10 2026 12:40 AM | Updated on Aug 10 2026 12:40 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సీఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ టేబుల్‌ టెన్నిస్‌ క్లస్టర్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన ఉత్కంఠభరితమైన పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఆర్‌ రెడ్డి విద్యాసంస్థల వైస్‌ ప్రెసిడెంట్‌ వీవీ బాలకృష్ణ, జాయింట్‌ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ, ట్రెజరర్‌ ప్రసాదరావు, డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్‌, ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ కే.వెంకటేశ్వరరావు, సీబీఎస్‌ఈ అబ్జర్వర్‌ భూపతిరాజు రామకృష్ణంరాజు, సీఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ పీ.సాయి కుమారి శంకర్‌ పాల్గొన్నారు.

విజేతల వివరాలు

● అండర్‌–14 బాలుర విజేత – సామ్రాక్‌ స్కూల్‌, రన్నరప్‌ – లిటిల్‌ ఏంజెల్స్‌, వైజాగ్‌

● అండర్‌ –14 బాలికల విజేత – శ్రీ ప్రకాష్‌, పెద్దాపురం, రన్నరప్‌ – టైమ్‌ స్కూల్‌

● అండర్‌ –17 బాలుర విజేత – లిటిల్‌ ఏంజెల్స్‌, రన్నరప్‌ – హ్యాపీ వ్యాలీ, ఆగిరిపల్లి

● అండర్‌– 17 బాలికల విజేత – శ్రీ ప్రకాష్‌, రన్నరప్‌ – సీఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌

● అండర్‌–19 బాలుర విజేత – చిరాక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, రన్నరప్‌ – శ్రీ ప్రకాష్‌, పెద్దాపురం

● అండర్‌ 19 బాలికల విజేత – శ్రీ ప్రకాష్‌, పెద్దాపురం, రన్నరప్‌ – సీఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌

సింగిల్స్‌ విభాగంలో

● అండర్‌ 14 బాలురు విజేత – సాయి మన్విత్‌, సామ్రాక్‌ స్కూల్‌, రన్నరప్‌ – హ్రిఆన్‌ కే సుచిత్ర స్కూల్‌

● అండర్‌ 14 బాలికల విజేత – రిధి టొరో, టైమ్స్‌ స్కూల్‌, రన్నరప్‌ – హెత్విక కొల్లి

● అండర్‌ 17 బాలుర విజేత – జి.లోహిత్‌, ఎన్‌ఎస్‌టీ మాథ్యూస్‌, రన్నరప్‌ – ఉదయం కామ్రా, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, హైదరాబాద్‌

● అండర్‌ 17 బాలికల విజేత – జీ.గాయత్రి కృష్ణ, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, నాచారం, రన్నరప్‌ – టి.సాయి సుదీక్ష

● అండర్‌ 19 బాలుర విజేత – చేతన్‌ సాయి, చిరాక్‌ స్కూల్‌, రన్నరప్‌ – టీ.సాయి శ్రవణ్‌, శ్రీ ప్రకాష్‌, పెద్దాపురం

● అండర్‌ 19 బాలికల విజేత – మౌపర్ణ దాస్‌, శ్రీ ప్రకాష్‌ సినర్జీ, పెద్దాపురం, రన్నరప్‌ – ఎం. లినిషా, సీఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement