గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు

Aug 10 2026 12:40 AM | Updated on Aug 10 2026 12:40 AM

గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు చల్లంగా చూడమ్మా.. పెద్దింట్లమ్మ గ్రావెల్‌ లారీ బీభత్సం

బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.

కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలందించమ్మా అంటూ పెద్దింట్లమ్మను భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆదివారం అమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, విరాళాలు, వాహన పూజల ద్వారా రూ.1,06,200 ఆదాయం వచ్చిందన్నారు.

ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో గ్రావెల్‌ లోడుతో వెళ్తున్న లారీ బంగారు దుకాణంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. గ్రామస్తుల వివరాలు ప్రకారం ఆదివారం సాయంత్రం గ్రావెల్‌ లోడుతో లారీ అతివేగంగా విజయవాడ వెళుతుండగా నెక్కలం గొల్లగూడెం వద్దకు రాగానే ఎదురుగా కారును తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ షాపు దుకాణంలోకి దూసుకుపోయింది. అక్కడే ఉన్న వారు గమనించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రతిరోజు వందలాది గ్రావెల్‌ లారీలను మద్యం మత్తులో అతివేగంగా నడిపి ఆందోళనకు గురి చేస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement