హత్య కేసులో జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో జీవిత ఖైదు

Aug 8 2026 12:53 AM | Updated on Aug 8 2026 12:53 AM

హత్య కేసులో జీవిత ఖైదు

కలిదిండి(కై కలూరు): హత్య కేసులో నేరం రుజువవడంతో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిందని ఎస్పీ కే.ప్రతాప్‌ శివ కిషోర్‌ చెప్పారు. కలిదిండి పోలీసు స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడిస్తూ.. కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారం శివారు కట్టావానిపాలెంకు చెందిన కట్టా పెద్దిరాజులు ఆస్తి కుమారుడి పేరున రాయాలని అడిగినందుకు భార్య జయలక్ష్మీని కత్తితో పొడిచి హత్య చేశాడన్నారు. అనంతరం నిందుతుడు ఆత్మహత్య నాటకమాడి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు సేకరించిన శాసీ్త్రయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలతో నేరం రుజువైందన్నారు. మృతురాలి కుమారుడు రాము ఫిర్యాదుపై అప్పటి కలిదిండి ఎస్సై వీ.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేయగా, కై కలూరు రూరల్‌ సీఐ వి.రవి కుమార్‌ దర్యాప్తు జరిపి చార్జిషీట్‌ దాఖలు చేశారన్నారు. పోలీసు సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో విశేష కృషి చేశారని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement