న్యూస్‌రీల్
అభివృద్ధికి శ్రీకారం
కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయం నానాటికి అభివృద్ధి చెందుతోంది. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 8లో u
ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి అమరావతి చాంపియన్‌షిప్ పోటీలను గురువారం ప్రారంభించారు. 8లో u
శురకవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెగా డీఎస్సీ పేరుతో కూటమి సర్కారు నిరుద్యోగులను దగా చేసిందని, డీఎస్సీలో పూర్తిస్థాయిలో అక్రమాలకు పాల్పడి అడ్డగోలుగా నియామకాలు చేపట్టిందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. అన్ని అర్హతలున్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారంటూ సర్కారు వంచనపై ఆ పార్టీ పోరుబాటను ఉధృతం చేసింది. ఇప్పటికే వినతిపత్రాలు అందజేసి, నిరసన ర్యాలీలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే నిరాహారదీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో గురువారం రిలే నిరాహారదీక్షా శిబిరాలు ప్రారంభమయ్యాయి.
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో ఉదయం ప్రారంభమైన ఈ దీక్షలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఈ దీక్షలు కొనసాగనుండగా, 10న భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
సీబీఐ విచారణ చేయాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో కై కలూరులో పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష శిబిరం ప్రారంభమైంది. యువత, డీఎస్సీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ డీఎస్సీ–2025 పేరుతో సర్కారు భారీ అక్రమాలకు పాల్పడి పోస్టులను లక్షల్లో అమ్ముకుని అర్హులకు అన్యాయం చేసిందని, దీనిపై సీబీఐ విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేసే వరకు పోరాటం
నూజివీడు పట్టణంలోని చినగాంధీ బొమ్మ సెంటరులో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మహిళలు మొదలుకొని నిరుద్యోగుల వరకు అందరినీ మోసగించారని మండిపడ్డారు. డీఎస్సీని అక్రమాలకు నిలయంగా మార్చారని ఆరోపించిన ఆయన, నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
సమగ్ర విచారణ జరగాలి
పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలంలో నియోజకవర్గ సమస్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. బాలరాజు మాట్లాడుతూ యువతకు జరిగిన మోసం, అన్యాయంపై సమగ్ర విచారణ జరగాలని డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తప్పిదాలతో నష్టపోయారు
ఉంగుటూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు నేతృత్వంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించి, సాయంత్రం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉపాధి లేక యువత పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూస్తున్నామని తెలిపారు. లక్షల మంది డీఎస్సీ పరీక్షలు రాస్తే ప్రభుత్వ తప్పిదాలు, అవకతవకలు, అడ్డగోలు చర్యల వల్ల అర్హులైన ఎంతోమంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.
లోకేష్ రాజీనామా చేయాలి
చింతలపూడిలోని ఫైర్‌స్టేషన్ సెంటరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. విజయరాజు మాట్లాడుతూ విద్యాశాఖమంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అర్హులైన యువతకు న్యాయం జరిగే వరకు పోరు కొనసాగిస్తామని తెలిపారు.
కఠినంగా శిక్షించాలి
ఏలూరు వసంతమహాల్ సెంటరులో ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తగిన సమాధానం చెప్పలేక డొంకతిరుగుడు మాటలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎన్నిసార్లు సీబీఐ విచారణ కోరినా పట్టించుకోకపోవడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ.. డీఎస్సీలో అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సర్కారు వంచనపై వైఎస్సార్‌ీసీపీ రిలే దీక్షలు
తరలివచ్చిన పార్టీ కేడర్, యువత, మేధావులు
సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్


