నన్ను నమ్మండి ప్లీజ్‌ అంటూ..! | - | Sakshi
Sakshi News home page

నన్ను నమ్మండి ప్లీజ్‌ అంటూ..!

Mar 20 2026 8:19 AM | Updated on Mar 20 2026 8:19 AM

న్యూస్‌రీల్‌

శురకవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నన్ను నమ్మండి ప్లీజ్‌.. నేను మీ ఎంపీని జస్ట్‌.. డ్రగ్స్‌ పార్టీకి వెళ్లి భోజనం చేసి వచ్చా అంతే. ఇది ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిన అనంతరం ఆయన కార్యాలయం నుంచి ఆయన పేరుతో చేసిన ప్రకటన సారాంశం. అయితే ఈ ప్రకటన వర్క్‌అవుట్‌ కాలేదు. దీంతో ఫ్లెక్సీలతో కవర్‌ చేయాలని ప్రయత్నించి తీవ్ర స్థాయిలో భంగపాటుకు గురయ్యారు. అలా ఇలా కాకుండా సోషల్‌ మీడియాలో ఫ్లెక్సీలను ఫొటోలుగా పెట్టి మరీ తారాస్థాయిలో సైటెర్లు పోస్టులు పెట్టడం గమనార్హం. ఇంత రచ్చ జరుగుతున్నా టీడీపీ ప్రజాప్రతినిధులు మొదలుకొని కార్యకర్తల వరకు ఏ ఒక్కరూ స్పందించకపోగా మనకు ఇదేమి కర్మ రా అంటూ చర్చించుకోవడం కొసమెరుపు.

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ మొయినాబాద్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు గత శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ రావడంతో అరెస్టు చేసి పార్లమెంట్‌ సమావేశాల పేరుతో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దీంతో జాతీయ స్థాయిలో ఏలూరు పరువు తీశారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా పోస్టులు కొనసాగాయి. జిల్లాతో సంబంధం లేని వ్యక్తిని లోకేష్‌ సొంత మనిషి అంటూ జిల్లాకు తీసుకువచ్చి మాపై రుద్ది.. జిల్లా పరువు తీశారంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే కేడర్‌ దగ్గర నిత్యం మాట్లాడుతుండటం గమనార్హం. ఈ క్రమంలో పోయిన పరువు అరకొర అయినా కాపాడుకోవడానికి ఎంపీ కార్యాలయం నానా తంటాలు పడుతూ చీఫ్‌ పాలిటిక్స్‌కు తెరతీసింది. పార్టీకి వెళ్లిన మాట వాస్తవమే.. భోజనం మాత్రమే చేశానంటూ ఎంపీ స్వయంగా వీడియో, ఆయన కార్యాలయం నుంచి ప్రకటన జారీ చేసింది. దీనిపైన సోషల్‌ మీడియాలో గట్టిగా సైటెర్లు వేస్తుండటం కనీసం మంత్రి కొలుసు పార్థసారథి మొదలుకొని ఏలూరు నగర స్థాయి నేతల వరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో పుట్టా మహేష్‌ కార్యాలయమే రంగంలోకి దిగి మీతో ఉన్నాం అంటూ నగరమంతా స్వయ ప్రకటిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.

ఏలూరు నమ్ముతుందంటూ నల్ల ఫ్లెక్సీలు

ఇక రెండు రోజుల క్రితం ఏలూరు నగరమంతా మేము మీతోనే ఉన్నాం.. ఏలూరు మిమ్మల్ని నమ్ముతుందంటూ నల్ల ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర కలకలం రేపింది. ఎంపీ కార్యాలయం మొదలుకొని అన్ని సెంటర్లలో ఫ్లెక్సీల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో జిల్లా పరువు, పార్టీ పరువు పొగొట్టి మళ్లీ సానుభూతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా అంటూ నగరమంతా చర్చ సాగుతుండటం గమనార్హం. మరోవైపు ఎంపీ వ్యవహారంపై సామాన్యులు సైతం మండిపడుతూ ఖ్యాతి ఉన్న ఏలూరు పరువు ఒక్క ఘటనతో పొగొట్టేశారంటూ బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి.

పురస్కారం అందుకుంటున్న సంగీత దర్శకుడు ఎస్‌పీఎస్‌ వాసు, చిత్రకారుడు డాక్టర్‌ వెంపటాపు

ఎంపీ పుట్టాకు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎంపీ కార్యాలయం

డ్రగ్స్‌ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు పుట్టా పాట్లు

ఏలూరు అంతా ఫ్లెక్సీలతో హంగామా

ముఖం చాటేసిన టీడీపీ ప్రజాప్రతినిధులు

టీడీపీ పరువు గోవిందా.. అంటూ కేడర్‌ అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement