నకిలీ ఇంజిన్‌ ఆయిల్స్‌ తయారీ సామగ్రి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నకిలీ ఇంజిన్‌ ఆయిల్స్‌ తయారీ సామగ్రి స్వాధీనం

Jan 1 2026 11:13 AM | Updated on Jan 1 2026 11:13 AM

నకిలీ

నకిలీ ఇంజిన్‌ ఆయిల్స్‌ తయారీ సామగ్రి స్వాధీనం

దాడి కేసులో యువకుడికి రిమాండ్‌

ముదినేపల్లి రూరల్‌: స్థానిక కారంమిల్లు సందులోని ఒక ఇంటిలో నకిలీ ఇంజిన్‌ ఆయిల్‌ తయారు చేస్తున్న సామగ్రిని బుధవారం ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ కై కలూరు రూరల్‌ సీఐ వి రవికుమార్‌, ఎస్సై వీరభద్రరావు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన కె.సురేష్‌, పి.నరేంద్ర ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఇంజిన్‌ ఆయిల్స్‌ తయారు చేస్తూ మంగళవారం పోలీసులకు పట్టుబడిన విషయం విధితమే. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు డ్రమ్ములు, నకిలీ ఇంజిన్‌ ఆయిల్‌, ప్రముఖ కంపెనీల లేబుల్స్‌, ఇతర 21 రకాల పరకరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

యూరియా బస్తాలు స్వాధీనం

నకిలీ ఇంజిన్‌ ఆయిల్‌ తయారీకి వినియోగిస్తున్న యూరియా బస్తాలను వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ షేక్‌ హబీబ్‌బాషా స్వాధీనం చేసుకున్నారు. ఇంజిన్‌ ఆయిల్‌ తయారీలో యూరియాను వినియోగిస్తున్నారనే సమాచారాన్ని పోలీసులు వ్యవసాయాధికారులకు తెలియజేశారు. దీనితో హబీబ్‌బాషా ముదినేపల్లి చేరుకుని ఆయిల్‌ తయారీకి వినియోగిస్తున్న యూరియా బస్తాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. యూరియాను ఎక్కడి నుండి కొనుగోలు చేసింది ఆరా తీశారు. ఇంజిన్‌ ఆయిల్‌ తయారుచేస్తన్న సురేష్‌ 27 బస్తాల యూరియాను కొనుగోలు చేసినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేవని దీనిపై నిందితులను విచారించగా కృష్ణాజిల్లా నిడుమోలు సొసైటీ నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. అలాగే స్థానిక ఎరువుల దుకాణాలను తనిఖీలు చేయగా సరైన పత్రాలు డీలర్లు చూపని కారణంగా 16.8 టన్నుల ఎరువుల అమ్మకాలు నిలిపివేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.

బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న దొంగల అరెస్టు

తణుకు అర్బన్‌: డబ్బుల వ్యవహారంలో మహిళ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసిన వేల్పూరు గ్రామానికి చెందిన ఎం.తేజ అనే యువకుడిని బుధవారం అరెస్టు చేసినట్లు తణుకు రూరల్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు పేర్కొన్నారు.

నకిలీ ఇంజిన్‌ ఆయిల్స్‌ తయారీ సామగ్రి స్వాధీనం 1
1/1

నకిలీ ఇంజిన్‌ ఆయిల్స్‌ తయారీ సామగ్రి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement