ఏలూరు రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు
ఏలూరు (టూటౌన్): యలమంచిలి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం జరిగిన టాటానగర్–ఎర్నాకులం రైలు ఫైర్ యాక్సిడెంట్‌కు సంబంధించి ఏలూరు రైల్వే స్టేషన్ నందు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హెల్ప్‌లైన్ నెంబర్ 75693 05268 కు కాల్ చేసి ప్రమాద వివరాలు, ప్రయాణ వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 8న రైలు నెం.07460 కాకినాడ టౌన్–వికారాబాద్, 9, 11 తేదీల్లో రైలు నెం.07461 పార్వతీపురం–వికారాబాద్, 10న ట్రైన్ నెం.07462 పార్వతీపురం–వికారాబాద్, 12న ట్రైన్ నెం.07463 పార్వతీ పురం–కాకినాడ టౌన్ ప్రత్యేకరైళ్లు నడుపనున్నారు. అలాగే జనవరి 8న ట్రైన్ నెం.07464 సికింద్రాబాద్–పార్వతీపురం, 9న ట్రైన్ నెం.07465 పార్వతీపురం–సికింద్రాబాద్, 7, 9 తేదీల్లో ట్రైన్ నెం.07186 కాకినాడ టౌన్–వికారాబాద్, 8న ట్రైన్ నెం.07185 వికారాబాద్–కాకినాడ టౌన్, 10న ట్రైన్ నెం.07187 వికారాబాద్–కాకినాడ మధ్య ప్రత్యక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
భీమవరం: వచ్చే నెల 3వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు జరుగనున్న సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి బి జాయ్‌కుమార్ ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడ వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్‌టీయూకే బ్యాడ్మింటన్ సెలక్షన్స్‌లో తమ విద్యార్థి జాయ్‌కుమార్ ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు అభినందించారు.
తాడేపల్లిగూడెం రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్.అగ్రహారం రాళ్ల సాహెబ్‌ల కాలనీ సమీపంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం వీకర్స్ కాలనీకి చెందిన ఈగల గణేష్ (20) తాపీ పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో ఎల్.అగ్రహారం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించగా ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని బంధువులు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా రూరల్ పోలీసులు తెలిపారు. మృతుని సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.
నైపుణ్యాలను
పెంపొందించుకోవాలి
నూజివీడు: పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్‌ను చదువుకునేటప్పుడే పెంపొందించుకోవడంపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ఎక్స్ ఐబీఎం, ఇండియా క్వాంటమ్ లీడ్ ఎల్ వెంకట సుబ్రహ్మణ్యం అన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సాంకేతిక మహోత్సవం టెక్‌జైట్ 25–2.0 ను సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్‌లో పరిశ్రమ రూపురేఖలను మార్చే శక్తిని కలిగి ఉందన్నారు. ఈ రంగంలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలుంటాయన్నారు. ఏపీ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ మాట్లాడుతూ క్వాంటమ్ మిషన్ ద్వారా శాసీ్త్రయ పరిశోధనలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, టెక్‌జైట్ కన్వీనర్ పీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు
ఏలూరు రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు


