వైఎస్సార్‌టీఏ జిల్లా కమిటీ ఎన్నిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం స్థానిక ఏఆర్‌డీజీకే హైస్కూల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి సు న్నం శ్రీను, రాష్ట్ర మహిళా ప్రతినిధి శారద సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. జిల్లా అధ్యక్షునిగా వడ్లమూడి రామ్మోహనరా వు, ప్రధాన కార్యదర్శిగా పగడాల సాంబశివరావు, గౌరవ అధ్యక్షుడిగా బి. సువర్ణ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.జోసఫ్ రాజు, కె.ప్రకాష్, ఉ పాధ్యక్షుడిగా ఎల్.కుమార్, కార్యదర్శిగా భూక్య హనుమంతరావు, కోశాధికారిగా కె.అర్జున రావు, మహిళా కా ర్యదర్శిగా పి.శ్రీలత, ఆడిట్ కమిటీ సభ్యుడిగా పి. సోమరాజులను ఎన్నుకున్నారు. అనంతరం సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందన్నారు. యాప్‌లు, బోధనేతర కార్యకలా పాలతో ఉపాధ్యాయులను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడు రామ్మోహనరావు మా ట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమస్యలపై పోరాటాలకు వెనకాడబోమన్నారు. ఉపాధ్యాయులు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాలో వైఎస్సార్‌టీఏను బలోపేతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణ చేపడతామని, మండల స్థాయిలో కూడా అసోసియేషన్‌ను నిర్మించి ఉపాధ్యాయులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు.


