రహదారి ప్రమాదాల నివారణే లక్ష ్యం
జంగారెడ్డిగూడెం: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు. రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్‌లు ధరించకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను నిలుపుదల చేసి, జరిమానాలు విధించడంతో పాటు, సదరు వాహదారులతో హెల్మెట్‌లను కొనుగోలు చేయించారు. ఇకపై ఎవరైనా నబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని ఏఎస్పీ సుచిత్ర రామనాథన్ హెచ్చరించారు. హెల్మెట్ లేని వాహనదారులకు, సరైన పత్రాలు లేని వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుచిత్ర రామనాథన్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు యువతే ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ తనిఖీలో జంగారెడ్డిగూడెం ఇన్‌స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


