పీయూసీ విద్యార్థులకు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్‌షాప్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ విద్యార్థులకు గురువారం గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్‌షాపును నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు హాజరైన ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ కేవీ ప్రతాప్ గ్రాఫిక్ డిజైనింగ్ రంగానికి సంబంధించిన అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజైన్ అనేది ఒక బ్రాండ్‌కు మౌన రాయబారి అనే భావనతో విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. వర్క్‌షాప్‌లో భాగంగా గ్రాఫిక్ డిజైన్, దాని మౌలిక సూత్రాలు, గ్రాఫిక్ డిజైన్ ఉపయోగించే రంగాలు, వివిధ డిజైనింగ్ టూల్స్, కాన్సెప్ట్, స్ట్రాటజీ వంటి అంశాలను సులభమైన ఉదాహరణలతో వివరించారు. విద్యార్థుల సందేహాలకు ప్రత్యక్షంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు, డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలు, కెరీర్ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరిన్ని రంగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, సాంకేతిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నామన్నారు.
భీమవరం: కాలువలోకి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరం రెండో పట్టణానికి చెందిన డి.పద్మావతి(62) లోసరి– గూట్లపాడు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం నుంచి ఆమె మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతుందని, బుధవారం రాత్రి నుంచి ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


