అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Dec 25 2025 8:17 AM | Updated on Dec 25 2025 8:17 AM

అనుమా

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

రాష్ట్రస్థాయిలో విజేతలుగా జిల్లా విద్యార్థులు క్వార్టర్స్‌కు చేరిన పురోహిత క్రికెట్‌ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

చెక్‌ డ్యామ్‌లో పడి రైతు దుర్మరణం

పెదపాడు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తిరువూరుకు చెందిన రెడ్డి అనీల్‌ హనుమాన్‌కు, జ్యోతి అలియాస్‌ హారిక(19)తో ఏడు నెలల క్రితమే వివాహం అయింది. వీరు హనుమాన్‌ జంక్షన్‌లోని పశువుల సంత ఎదురుగా అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అనీల్‌ హనుమాన్‌ జంక్షన్‌లో సుజుకి షోరూమ్‌లో మెకానికల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 23 తేదీ రాత్రి 10.45 గంటల సమయంలో తన భార్య అనుమానాస్పద రీతిలో మృతి చెందిందని స్థానికులకు అనీల్‌ చెప్పడంతో వారు పెదపాడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్‌టీమ్‌ సహాయంతో వివరాలు సేకరించారు. మృతురాలి సోదరి చింతా శ్రావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్‌ తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో ఏలూరు జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచి బహుమతులు సాధించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన పోటీల్లో ఉంగుటూరు మండలం నారాయణపురం జెడ్పీహెచ్‌ స్కూల్‌ విద్యార్థి జీవీ మహీధర్‌ తెలుగు మీడియం వక్తృత్వ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు. ఏలూరులోని శ్రీ శర్వాణి హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని టీ.శ్రావ్య ఇంగ్లీష్‌ మీడియం వక్తృత్వ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచింది. అలాగే ఏలూరు సెయింట్‌ థెరిసా కళాశాలకు చెందిన ఎస్‌కే రేష్మ కళాశాల విద్యార్థుల విభాగంలో ఇంగ్లీష్‌ మీడియం వక్తృత్వ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచింది. వీరికి ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీ షా, మరో ఐఏఎస్‌ అధికారి ఎన్‌.ఢిల్లీ రావు బహుమతులు అందించి అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి బహుమతులు సాధించడం అభినందనీయమని అన్నారు.

భీమవరం: భీమవరం డీఎన్నార్‌, కేజీఆర్‌ఎల్‌ కళాశాలలోని క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్‌ లీగ్‌ క్వార్టర్స్‌ దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌, రాజమండ్రి, గుడివాడ, ఐ భీమవరం టీమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. బుధవారం 8 మ్యాచ్‌ లను నిర్వహించారు. ఖమ్మం –అమలాపురం మధ్య జరిగిన హోరాహోరి పోటీలో అమలాపురం విజయం సాధించగా, భీమవరం – వైజాగ్‌ మ్యాచ్‌ టై అవ్వగా సూపర్‌ ఓవర్‌ లో భీమవరం గెలిచింది. రాజమండ్రి – శ్రీకాకుళం మధ్య మ్యాచ్‌లో రాజమండ్రి విజయం సాధించగా, తిరుపతి – అమలాపురం మధ్య జరగిన మ్యాచ్‌లో తిరుపతి, రాజమండ్రి – గుడివాడ మ్యాచ్‌లో రాజమండ్రి కాకినాడ – చైన్నె మధ్య పోటీలో కాకినాడ విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

భీమవరం: చెట్టు కొమ్మలు కొట్టేందుకు చెట్టు ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. టూటౌన్‌ ఎస్సై కె రామారావు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక గొల్లవానితిప్ప రోడ్డుకు చెందిన కుంచాల వెంకన్న (40), అతని సోదరుడు నర్సింమూర్తి కలిసి డీఎన్‌ఆర్‌ కళాశాల సమీపంలో ఒక నివాసం వద్ద చెట్టును కొట్టేందుకు బుధవారం మధ్యాహ్నం వెళ్లారు. చెట్లు కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు వెంకన్న చెట్టు నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి అప్పటికే వెంకన్న మృతి చెందినట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి 1
1/2

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి 2
2/2

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement