గంగానమ్మ అమ్మవారి సేవలో స్పీకర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో జరుగుతున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా స్థానిక దక్షిణపు వీధిలోని మేడల్లో కొలువై ఉన్న గంగానమ్మ అమ్మవారిని మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దకాలానికి పైగా హేలాపురి ఇలవేల్పుగా పూజలందుకుంటోన్న గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రమంతటా సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తొలుత ఆయనకు దక్షిణపు వీధి జాతర కమిటీ అధ్యక్షుడు అద్దేపల్లి శ్రీనివాసరావు, ఇతర సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం జాతర కమిటీ సభ్యులు స్పీకర్‌ను ఘనంగా సన్మానించారు.
ఉండి: అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదైంది. ఉండి మండలం వెలివర్రు శివారు ప్రాంతం గరువులో తాటిపర్తి చిట్టెమ్మను ఆమె భర్త అదనపు కట్నం తీసుకురావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


