‘పుడమి పుత్ర’ అవార్డుతో సత్కారం
పెదవేగి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ పంటలు పండించిన రైతులను గాంధీ హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ ఫ్యామిలీవారు పుడమి పుత్ర అవార్డుతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను జిల్లాకు ఒక రైతును ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా నుంచి పెదవేగి మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన కొత్త జయకళాచంద్రరావును పుడమి పుత్ర అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా జయకళాచంద్రరావు మాట్లాడుతూ 4 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్, నిత్యం 25 రకాల కూరగాయ పంటలను ఎటువంటి రసాయన పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, మంచి ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నంందుకుగాను తనకు ఈ అవార్డు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయకళాచంద్రరావు, లావణ్య దంపతులను పలువురు అభినందించారు.


