పెద్దింట్లమ్మ హుండీ ఆదాయం రూ.6.60 లక్షలు
కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తులు హుండీలో వేసిన కానుకలు 97 రోజులకుగాను రూ.6,60,853 ఆదాయం వచ్చిందని ఈవో కూచిపూడి శ్రీనివాస్ చెప్పారు. లెక్కింపు కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు, దేవాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు హాజరయ్యారని తెలిపారు.
పోలవరం: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి యోగేష్ పైదస్కార్ బుధవారం పోలవరం సందర్శనకు వస్తున్నట్లు జలవనరుల శాఖాధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావస కాలనీని సందర్శించి, అనంతరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖాధికారులతో సమీక్షించనున్నారు. మండలంలోని ఎల్‌ఎన్‌డీ పేట పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు నిర్మించిన గృహాలు, మౌలిక వసతులు కూడా పరిశీలించనున్నారు.


