ప్రభుత్వ భూమి కబ్జా
నూజివీడు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన నా టి నుంచి ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నూజివీడు మండలం గొల్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న దాదాపు 10 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇటుగా కన్నెత్తి చూసేందుకు రెవె న్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సాహసించడం లేదు. అక్రమార్కులకు టీడీపీ నాయకుల అండదండలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ స్థలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వ హ యాంలో శంకుస్థాపనలు జరిగా యి. అంగన్‌వాడీ కేంద్రానికి, పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా బల్క్‌కూలర్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంగన్‌వాడీ భవన నిర్మా ణం బేస్‌మెంట్ స్థాయి వరకూ పూర్తయి ఆగిపోగా, బల్క్‌కూలర్ యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు ఆ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. 10 సెంట్ల స్థలం విలువ దాదాపు రూ.25 ల క్షలపైనే ఉంది. ఈ ఆక్రమణపై గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సైతం ఇచ్చారు. అయినా ఆక్రమణదారులు మా త్రం ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తే అర్జీని పరిష్కరించడానికి నెల రోజులు సమయం ఉంటుందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, ఈలోపు స్లాబ్ లెవెల్ వరకూ గోడలు సైతం నిర్మాణమవుతాయని పలువురు అంటున్నారు. కలెక్టర్ స్పందించి ఆక్రమణలను నిలువరించాలని కోరుతున్నారు.


