‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

Nov 24 2025 8:02 AM | Updated on Nov 24 2025 8:02 AM

‘సాక్

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

గణిత జ్ఞానాన్ని పెంచేలా..

అవగాహన పెరుగుతుంది

బాగా రాశాను

ఇంగ్లిష్‌లో పట్టు

ఆలోచనలు పెంచేలా..

ఎంతో ఉపయుక్తం

ఉమ్మడి జిల్లా నుంచి భారీగా రాక ఇంగ్లిష్‌, గణితంపై పట్టు సాధించేందుకు దోహదం

తాడేపల్లిగూడెం (టీఓసీ): పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఇంగ్లిష్‌, గణితంలో ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ క్వార్టర్‌ ఫైన ల్స్‌ పరీక్షలు ఆదివా రం తాడేపల్లిగూడెంలోని సెంట్‌ ఆన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో నిర్వహించారు. లెక్కలపై భయా న్ని పోగొట్టడంతో పాటు ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పెంచేలా నిర్వహించిన పరీక్షలు ఉత్సాహంగా సాగాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా పరిధి లోని జంగారెడ్డిగూడెం, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో సెంట్‌ ఆన్స్‌ ప్రాంగణంలో సందడి నెలకొంది. సెంట్‌ ఆన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ అద్దంకి విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కె.ప్రవీణ్‌ వర్మ, శిరీషా, శ్రీనివాస్‌ పరీక్షలను ప ర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి మెయిన్‌ స్పాన్సర్‌గా డ్యూక్స్‌ వాఫే, అసోసియేట్‌ స్పాన్సర్‌గా ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రాజమండ్రి వారు వ్యవహరిస్తున్నారు.

గణిత సమస్య పరిష్కారంలో ప్రాక్టీస్‌ చేయడానికి, నైపుణ్యాలు సాధించ డానికి మ్యాథ్‌బీ పరీక్షలు ఉపయుక్తం. గణిత జ్ఞానాన్ని కొత్తమార్గంలో అన్వయించడానికి, భవిష్యత్‌ పరీక్షలకు సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.

– యశస్విని, కేకేఆర్‌ గౌతమ్‌, ఏలూరు

సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షలు రాయడం వల్ల పోటీ పరీక్షలపై అవగాహన పెరుగుతుంది. భయం తగ్గుతుంది. పై స్థాయి పోటీలకు వెళ్లాలనే లక్ష్యం ఏర్పడుతుంది. మా భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తం.

– కె.ప్రజ్ఞత, ప్రతిభ స్కూల్‌, జంగారెడ్డిగూడెం

క్వార్టర్‌ ఫైనల్స్‌ స్పెల్‌బీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి ఫైనల్‌ స్థాయిలకు వెళ్లేందుకు కృషి చేస్తాను. పరీక్ష బాగా రాశాను. మరింత ఉత్సాహం వస్తుంది. పరీక్షల నిర్వహణ అభినందనీయం.

– జె.హర్షిత్‌, ఆదిత్య, పాలకొల్లు

ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్‌ నేర్చుకోవడం వల్ల పదాలు గుర్తు ఉండటం, పట్టు సాధించడం జరుగుతుంది. ప్రతి పదం అర్థం కూడా నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. స్పోకెన్‌ ఇంగ్లిష్‌కు ఉపయుక్తం.

– ఎం.వర్షిణి, ఆదిత్య, నరసాపురం

విద్యార్థుల్లో విశ్లేషనాత్మక ఆలోచనలు పెంచేలా భవిష్యత్తు సవాళ్లకు వారిని సిద్ధం చేసేలా సాక్షి స్పెల్‌బీ పరీక్షల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి పరీక్షలు విద్యార్థుల్లో భయాన్ని పోగొడతాయి. సాక్షికి అభినందనలు.

– కె.సత్యనారాయణ, విద్యార్థి తండ్రి

విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు గణితంపై పట్టు సాధించేలా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షల నిర్వహణ అభినందనీయం. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం.

– జి.నాగజ్యోతి, టీచర్‌, ప్రతిభ స్కూల్‌, జంగారెడ్డిగూడెం

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 1
1/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 2
2/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 3
3/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 4
4/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 5
5/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 6
6/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 7
7/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 8
8/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన 9
9/9

‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement