పెళ్లి వ్యాన్ బోల్తా
బుట్టాయగూడెం: పెళ్లికి వెళ్తున్న టాటా ఏస్ వాహనం తిరగబడటంతో పలువురు గాయపడ్డారు. మండలంలో ని కేఆర్‌పురం ఐటీడీఏ సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదానికి సంబంధించి స్థానికుల వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంకు చెందిన పెళ్లి బృందం ద్వారకాతిరుమల మండలం గుణ్ణపల్లిలో పెళ్లికి వెళ్తుంది. పెళ్లి కూతురు, ఆమె తల్లిదండ్రులు ఒక వాహనంలో ముందు వెళ్లారు. వారి వెనుక బంధువులు, గ్రామస్తులు ఆదివారం టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో కేఆర్‌పురం ఐటీడీఏ సమీపానికి వచ్చే సరికి ప్రమాదవశాత్తూ స్టీరింగ్ పట్టేయడంతో వా హన డ్రైవర్ దానిని సరిచేసే ప్రయత్నంలో బోల్తా కొట్టింది. వాహనం తిరగబడిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు. వాహనంలోని సుమారు 16 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేశారు.


