పర్యావరణాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని కాపాడుకుందాం

Jun 5 2025 8:02 AM | Updated on Jun 5 2025 8:02 AM

పర్యా

పర్యావరణాన్ని కాపాడుకుందాం

సామాజిక బాధ్యతగా భావించాలి

పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలి. ప్లాస్టిక్‌ రహిత సమాజ స్థాపనే పర్యావరణ పరిరక్షణకు మార్గం. ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలి. ప్లాస్టిక్‌ సంచులు వాడటం వాటి వల్ల వచ్చే అనర్థాలను ప్రజల్లో అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత అందరి పైన ఉంది. విద్యార్థులకు కళాశాల స్థాయిలో అవగాహన కలిగిస్తున్నాం.

– డాక్టర్‌ ఎం.హరిప్రసాద్‌, అధ్యాపకుడు, వైవీఎన్నార్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కై కలూరు

కాటన్‌ బ్యాగుల వినియోగం బెటర్‌

జూట్‌ పేపర్‌ కాటన్‌ బ్యాగులు మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్‌ అనర్థాలపై ప్రధాన కూడళ్ల వద్ద ప్రచార బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేయాలి. మున్సిపల్‌, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. దుకాణదారుల్లో క్యారీ బ్యాగులు వాడటం వల్ల అనర్థాలపై అవగాహన కలిగించాలి. ప్రజలను పూర్తిగా భాగస్వామ్యం చేయాలి.

– పి.పవన్‌కాంత్‌, స్వీప్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, కై కలూరు

కై కలూరు: పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మానవాళిని కాపాడుతోంది. దీని ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. స్వీడన్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1972 జూన్‌ 5న పర్యావరణ పరిరక్షణ అవగాహన సమావేశం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2022 జూన్‌ 5తో ప్రపంచ పర్యావరణ సంబరాలకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ఓడిద్దాం అనే నినాదంతో యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొగ్రాం(యూఎన్‌ఈపీ) జరుగుతుంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణంపై అవగాహన సమావేశాలు నిర్వహించనున్నాయి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మొక్కలు నాటే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

ప్లాస్టిక్‌ బాంబులు

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్‌ వాడకం. ప్రతి సంవత్సరం 19–23 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు జల పర్యావరణ వ్యవస్థలో చేరుతున్నాయని అంచనా. 1950లో 2 మిలియన్‌ టన్నుల నుంచి నేడు 430 మిలియన్‌ టన్నులకు ప్లాస్టిక్‌ వాడకం పెరిగింది. ప్రధానంగా మైక్రో ప్లాస్టిక్‌ సముద్ర జలాల్లో చేరడం వల్ల తాబేళ్లు, తిమింగళాలతో పాటు అరుదైన సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ప్రమాదకర క్యారీ బ్యాగులను నియంత్రించలేకపోతున్నారు.

అమలుకు నోచుకోని నిబంధనలు

క్యారీ బ్యాగుల నిషేధం చట్టం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ చట్టం అమలు కోసం నియమించిన జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టర్లు, మేయర్లు మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పొల్యూషన్‌ బోర్డ్‌ అధికారులు, పరిశ్రమల సంస్థ బాధ్యులు, జిల్లా పంచాయతీ అధికారి సభ్యులుగా ఉంటారు. గ్రామస్థాయిలోనూ కమిటీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కమిటీల ఊసే లేదు. దాడులు కూడా స్వల్సంగా జరుగుతున్నాయి. ఎవరైనా కోర్టుల్లో పిల్‌ వేసినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదు.

క్యారీ బ్యాగుల నిషేధం ఏదీ

120 మైక్రాన్‌ల మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ సంచులు నిషేధం. తయారీదారులు ప్రతి క్యారీ బ్యాగ్‌పై చిరునామాతో పాటు రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌, అసలు ప్లాస్టిక్‌ వివరాలను ముద్రించాలి. సహజ చాయ తెలుపు రంగులో కవర్లను మాత్రమే వాడాలి, ఈ నిబంధన అతిక్రమించిన తయారీదారులకు రూ.25 వేల నుంచి రూ.50,000, చిల్లర వ్యాపారులకు రూ.2,500 నుంచి రూ.5,000, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ సంచులను పారవేస్తే రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధించాలి. ఇవి నామమత్రంగా అమలవుతున్నాయి.

భూమిలో విచ్ఛిన్నమవడానికి ఎంత సమయం..

న్యూస్‌ పేపర్‌ 4 నుంచి 6 వారాలు.

సిగిరెట్‌ చివర ఫిల్టర్‌ మొన ఒకటి నుంచి 5 సంవత్సరాలు.

క్యారీ బ్యాగు 10 నుంచి 20 సంవత్సరాలు.

స్టీల్‌ టీం క్యాన్‌ 50 సంవత్సరాలు.

శీతల పానీయాల అల్యూమినియం బాటిల్‌ 80 నుంచి 200 సంవత్సరాలు.

ప్రిజ్‌లోని ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు 450 సం.లు

గాజు బాటిళ్లు (బీరు సీసాలు) మిలియన్‌ సంవత్సరం.

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఈ ఏడాది నినాదం.. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ఓడిద్దాం

కొల్లేరు అభయారణ్యంలో పర్యావరణం మృగ్యం

జిల్లాలో పర్యావరణంపై అవగాహన సదస్సులు

కొల్లేరులో పర్యావరణానికి విఘాతం

రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. ఇక్కడ పర్యావరణం నచ్చడంతో వలస పక్షులు లక్షలాదిగా ప్రతి ఏటా తరలివస్తున్నాయి. కొల్లేరు సరస్సు 901 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. కొల్లేరు అభయారణ్యంగా 5వ కాంటూరు వరకు 77,138 ఎకరాలను గుర్తించారు. కొల్లేరు సరస్సుకు పెలికాన్‌, పెయింటెడ్‌ స్టోక్‌, ఐబీస్‌, స్టిల్ట్‌ వంటి 185 రకాల జాతుల పక్షులు సంచరిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సరస్సు కాలుష్యపు బారిన పడింది. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలతో సరస్సు ఉనికిని కోల్పోతుంది. సహజ సిద్ధ చేపలు మృత్యువాత పడుతున్నాయి. అక్రమ చెరువుల్లో రసాయనాల వాడకం కొల్లేరు పర్యావరణానికి విఘాతం కలుగుతోంది.

పర్యావరణాన్ని కాపాడుకుందాం 1
1/4

పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణాన్ని కాపాడుకుందాం 2
2/4

పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణాన్ని కాపాడుకుందాం 3
3/4

పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణాన్ని కాపాడుకుందాం 4
4/4

పర్యావరణాన్ని కాపాడుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement