నేత్రపర్వం చాత్మార్ ఉత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారికి చాత్మార్ ఉత్సవం శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో నేత్రపర్వంగా జరిగింది. శ్రీమద్రామానుజుల తిరు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించారు. అనంతరం పూజాధికాలు జరిపి హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు.


