చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల వేళ అరాచకాలకు అదుపు లేకుండా పోయిందని, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకుందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల ధ్వజమెత్తారు. సోమవారం రాజమహేంద్రవరం మెయిన్‌ రోడ్డులో వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ సారథ్యంలో నగరపాలక సంస్థ వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు, కార్పొరేటర్‌ అభ్యర్థులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందాన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దర్పంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల బ్యాలెట్‌ పేపర్లను చెత్త బుట్టలో వేసిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరిగాయన్నారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిజాయితీగా పోరాటం చేస్తున్నారన్నారు. వెన్ను చూపి పారిపోయే అలవాటు తమ అభ్యర్థులకు లేదన్నారు. ఎప్పటికై నా న్యాయం గెలుస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు, కార్పొరేటర్‌ అభ్యర్థులను అఖండ మెజార్టీలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఓటమి భయంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను కొనాలని బేరాలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులతో పాటు దాసి వెంకటరావును మేయర్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనలో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఒక్కసారి వైఎస్సార్‌ సీపీకి గెలిపిస్తే టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించే చర్యలు చేపడతామన్నారు. రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాషా్‌ట్రన్ని అప్పులమయంగా తయారు చేసిందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు, ఏపీ హెచ్‌బీసీ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు గుర్రం గౌతమ్‌, కానుబోయిన్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార

ప్రతినిధి ఆరే శ్యామల

ఫ రాజమహేంద్రవరం

మెయిన్‌ రోడ్డులో భారీ ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement