జనసేనపై భగ్గుమన్న టీడీపీ | - | Sakshi
Sakshi News home page

జనసేనపై భగ్గుమన్న టీడీపీ

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌కు కేటాయించినప్పటి నుంచి ఆ విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి విషయంలో కూటమిలో ముందస్తు ఒప్పందానికి తూట్లు పొడిచి, జనసేన స్వార్థ రాజకీయాలు చేస్తుందని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, ఏపీ స్కీల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో భాగంగా జనసేన కౌన్సిలర్‌ డాక్టర్‌ తోపరాల కల్యాణ చక్రవర్తి 18 మంది కౌన్సిలర్ల మద్దతుతో వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు కూటమి పొత్తులో భాగంగా మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనసేనకు, వైస్‌ చైర్మన్‌ పదవి టీడీపీకి కేటాయిస్తూ స్వయంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ప్రకటించారు. అయితే అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో వైస్‌ చైర్మన్‌ పదవి జనసేన కౌన్సిలర్‌ డాక్టర్‌ తొపరాల కల్యాణ చక్రవర్తికి వరించడంతో టీడీపీ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ మేరకు సోమవారం టీడీపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల అత్యవసర సమావేశంలో బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి టీడీపీ కౌన్సిలర్‌ కొమ్మిన వెంకటేశ్వరరావుకు ఇవ్వకపోతే పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేస్తానని ఆయన హెచ్చరించారు. జనసేన నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే ఎన్‌డీఏ కూటమి ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే, 2029 ఎన్నికల్లో వెన్నెముక లేని పార్టీలుగా మిగిలిపోతాయన్నారు. టీడీపీ వైస్‌ చైర్మన్‌ విషయంలో మంత్రి దుర్గేష్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి మాట్లాడినా, ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం టీడీపీ వైస్‌ చైర్మన్‌ పదవి విషయంలో న్యాయం చేయని పక్షంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించడానికి సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు. ఒకానొక దశలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఫ ఒప్పందానికి తూట్లు పొడిచారని

టీడీపీ నేత ఆగ్రహం

ఫ అవసరమైతే ఆమరణ దీక్ష

చేపడతానని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement